తన భావోద్వేగాలను బయటపెట్టిన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్
- January 14, 2020
పుల్లెల గోపిచంద్! ప్రముఖ జాతీయ బ్యాడ్మింటెన్ కోచ్! సైనానెహ్వాల్ , పీవీ సింధూలాంటి అద్భుతమైన ప్లేయర్లను తీర్చిదిద్దిన వ్యక్తి. సాధారణంగా ఆయన తన భావోద్వేగాలను బయటపెట్టరు. అలాంటిది ఇప్పుడు ఓ చేదు నిజాన్ని వెల్లడించారు. సైనా నెహ్వాల్ ..తన అకాడమినీ వీడటం కలిచివేసిందన్నారు. ఈ విషయంలో గురువు ప్రకాష్ పదుకునే.. కనీసం సైనాతో తన గురించి సానుకూలంగా మాట్లాడకలేకపోవడం బాధించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గోపీచంద్‌పై ప్రముఖ క్రీడా జర్నలిస్ట్ బోరియా మజుందార్ డ్రీమ్స్ ఆఫ్ ఎ బిలియన్ అనే పుస్తకం రాస్తున్నారు. ఈ సందర్భంగా.. సైనా నెహ్వాల్ వివాదాన్ని మజుందార్‌తో పంచుకున్నారు గోపిచంద్.
2014లో సైనానెహ్వాల్ తన అకాడమీని వీడుతుంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తి దూరమైనట్లు అనిపించిందని.. ఆమెను వెళ్లొద్దని అప్పటికే చాలాసార్లు బతిమిలాడినట్లు తెలిపారు. ఇతరుల ప్రభావంతో అకాడమీ వీడేందుకే సైనా నిర్ణయించుకుందని, దీంతో తాను ఆపలేకపోయానన్నారు. సైనా వెళ్లడం ఇద్దరికీ మంచిది కాదని తెలిసినా అదే సమయంలో వేరే క్రీడాకారులను చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని గుర్తు చేశారు. పీవీ సింధూ 2012-14లో అత్యుత్తమంగా రాణించినా.. తానెప్పుడు సైనా నెహ్వాల్‌ను విస్మరించలేదన్నారు గోపిచంద్. ఈ విషయాన్ని ఆమెకు సరిగ్గా చెప్పలేకపోయినట్లు తెలిపారు. అయితే తాను రోల్ మోడల్‌గా భావించే ప్రకాశ్ పదుకునే.. సైతం సైనాతో మాట్లాడలేదన్నారు. పైగా సైనానీ హైదరాబాద్ వీడమని ఆయనే బలవంతం చేసినట్లు తెలిపారు. ప్రకాష్ సర్ తన గురించి ఎందుకు సైనాతో చర్చించలేదో ఇప్పటికీ అర్థంకాని విషయంగా మిలిగిపోయిందంటూ చెప్పుకొచ్చారు గోపిచంద్.
సైనా గోపిచంద్ అకాడమీ వీడాక… 2016లో రియో ఒలింపిక్స్‌లో ఘోరంగా ఒడిపోయింది. తొలిరౌండ్లోనే ఆమె ఇంటి ముఖం పట్టింది. సైనా జీవితంలో అవి గడ్డురోజులు. 2016 ఒలింపిక్స్‌లో తొలి రౌండ్లోనే వెనుతిరిగింది. దీని వల్ల కొన్నేళ్ల సాధన వృథా అయిందని, ఆ సమయంలో గోపీ సర్ సైనాతో లేరన్నాడు ఆమె భర్త పారుపల్లికశ్యప్. ఆ తర్వాత గాయమై సర్జరీ చేయించున్న సైనాకు…. అప్పుడేం చేయాలో అర్థమయ్యేది కాదన్నాడు. 2017లో ప్రపంచ ఛాంపియన్షిప్ పతకం గెలిచాక.. గోపి సర్ వద్ద వెళ్లి క్షమాపణ చెప్పాలని అనుకుందంటూ.. నాటి సంగతులను వివరించాడు కశ్యప్. ఈ పుస్తకాన్ని హార్పర్ కొలిన్స్ పబ్లికేషన్స్ ఈ నెల 20న మార్కెట్లో విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







