సౌదీలో చిక్కుకున్న తెలంగాణ వాసులు
- January 17, 2020
తెలంగాణ:సౌదీ అరేబియా దేశంలో చిక్కుకున్న తమ వారిని ఇండియాకు వాపస్ తెప్పించాలని జగిత్యాల మండలానికి చెందిన రెండు కుటుంబాల వారు ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డిని కలిసి కోరగా, ఆయన సూచన మేరకు వారు శుక్రవారం (17.01.2020) జగిత్యాల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు.
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన నక్క వేణు, జగిత్యాల అర్బన్ మండలంలోని అంబర్ పేట కు చెందిన గోనెల వెంకటి ఉపాధి నిమిత్తం ఆరేళ్ళ క్రితం సౌదీ అరేబియాకు లోని అభా ఖమీస్ ముషాయత్ ప్రాంతానికి వెళ్లారు.
యజమాని వారి గుర్తింపు కార్డులను లాక్కున్నాడని, యజమాని సోదరులు డిసెంబర్ 14 న దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నక్క వేణు, గోనెల వెంకటి సౌదీ లోని జిద్దా ఇండియన్ కాన్సులేట్ లో, లేబర్ కోర్టులో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఒక్కొక్కరు 9 వేల సౌదీ రియాల్స్ చెలిస్తేనే దేశం వదిలి వెళ్లేందుకు అనుమతి (ఎగ్జిట్ పర్మిట్) ఇస్తానని యజమాని డిమాండ్ చేస్తున్నాడని వారు తెలిపారు.
నక్క వేణు తండ్రి భూమయ్య,గోనెల వెంకటి భార్య మల్లేశ్వరి లు లక్ష్మీపూర్ కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు తిరుపతి రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లాల జయపాల్ లతో కలిసి జిల్లా కలెక్టరు కు వినతి పత్రం సమర్పించారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







