పావలా శ్యామల కు కేసీఆర్ తక్షణ సాయం ...
- January 18, 2016
-10 వేల పింఛన్, డబుల్ బెడ్ రూం ఇవ్వాలని సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు ఆదేశంరంగస్థల నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ను సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆదుకున్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక జిందగీలో ప్రచురితమైన పావలా లేని శ్యామల కథనానికి స్పందించిన కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉంటానని ఆమెకు భరోసానిచ్చారు. ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో పావలా శ్యామల సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ శ్యామలకు తక్షణ సాయం కింద రూ. 20 వేలు ఇచ్చారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ తరపున నెలకు రూ. 10 వేలు పింఛన్ ఇవ్వాలని డైరెక్టర్ మామిడి హరికృష్ణను ఆదేశించారు. ఇంటి అద్దె కట్టడానికి ఇబ్బంది పడుతున్న శ్యామలకు డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.శ్యామల వెంట ఆమె కూతురు మాధవి కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







