సోషల్ మీడియా నుంచి పిల్లలను నియంత్రించండి - ఒమాన్ పోలీసుల సూచన

- January 18, 2016 , by Maagulf
సోషల్ మీడియా నుంచి పిల్లలను నియంత్రించండి - ఒమాన్ పోలీసుల సూచన

  సామాజిక మాధ్యమాలలో పిల్లలు, యువకుల పాత్రను వారి తల్లితండ్రులు నియంత్రించాలని రాయల్ ఒమాన్ పోలీసులు సూచిస్తున్నారు. గత ఏడాది పలువురు తల్లితండ్రులు తమకు వారి పిల్లల విపరీత చేష్టలను గూర్చి విజ్ఞప్తులు చేశారని ' ఒమాన్ టైమ్స్ ' కు  తెలిపారు.  ఒమాన్  పోలిసుల అధికారక ట్విట్టర్ ఈ విధంగా వారు పేర్కొన్నారు. " ప్రియమైన తల్లితండ్రులారా..మీ పిల్లల దృష్టి  సోషల్ మీడియా పై ఉంది.వారు తమకు తెలియకుండా దోపిడికి గురయ్యే అవకాశం ఏర్పడనుంది. ఇందులో ప్రధాన సమస్య ఏమిటంటే , ఆన్ లైన్ లో, అపరిచిత వ్యక్తులతో అక్రమ స్నేహాలకు ఆకర్షితులవడమే కాక తమ తమ ఫోటోలను పరస్పర మార్పిడి చేసుకొని కొన్ని అసాంఘిక  కార్యకలాపాలకు పాల్పడుతున్నారని  మీకు తెలియచెస్తున్నాం. ఇది పెద్ద నేరమని ఈ సందర్భంగా మీకు గుర్తుచేస్తున్నాం. ఈ తరహా వ్యవహారాలూ ,సమాజ సమగ్రతను దెబ్బ తీయడమే కాక బాలల భవిష్యతు దెబ్బతింటుందని తెలియచెస్తున్నాం. మీ పిల్లలు  ఆన్ లైన్లో చేసే ఛాటింగులు పెద్ద సమస్యలకు మూలం కాగలదని అన్నారు. తల్లితండ్రులైన మీరు మా పోలిసుల మాదిరిగా కాక వారితో స్నేహంగా మెలుగుతూ మానవీయ విలువలను ప్రభోదిస్తూ, వారిపై మృదువైన నియంత్రణ కొనసాగించాలని రాయల్ ఒమాన్ పోలీసు ఉన్నతాధికారి  బుసైది సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com