`ఈ కథలో పాత్రలు కల్పితం` మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి!!
- January 25, 2020
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా..
నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ - "ఈ కథలో పాత్రలు కల్పితం' ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు అందమైన లొకేషన్స్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న నటుడిలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. దర్శకుడు అభిరామ్ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. 'జెస్సీ' కి సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన సునీల్ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్, 'ఆర్‌ఎక్స్ 100', 'కల్కి' వంటి సూపర్‌హిట్ చిత్రాలకు అద్భుతమైన డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ డైలాగ్స్ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి" అన్నారు.
పవన్ తేజ్, మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ ఎన్, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, ఫైట్స్: షావోలిన్ మల్లేష్, ఆర్ట్: నరేష్ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్ సయ్యద్, కాస్ట్యూమ్ డిజైనర్: సియ డిజైనర్స్, కో-డైరెక్టర్: కె. శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి, నిర్మాత: రాజేష్ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్ ఎం.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..