సీఎం జగన్ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదు:సుమన్
- January 25, 2020
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులు వారికి ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఈ విషయంలో సినీ పరిశ్రమను కోరితే ‘మా’మూవీ అసోసియేషన్ తరఫున తప్పకుండా తమ వంతు సహకారం అందిస్తామన్నారు. మాచర్లలో సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాజధాని అమరావతిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించారు. మూడు రాజధానుల విషయంలో సీఎం అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. సీఎం జగన్ను కలవడానికి ఐదుసార్లు ప్రయత్నించానని, అయితే తనకు అపాయింట్మెంట్ దొరకలేదని తెలిపారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







