ఫిబ్రవరి 5న ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ ..
- January 18, 2016
ఇన్నాళ్లు వెండితెర మీద పోటి పడటానికి సినీ తారలు ఇష్టపడ లేదు. ముఖ్యంగా బడ్జెట్ పెరిగిపోవటం, మార్కెట్ ఆశించిన స్థాయిలో ఉండకపోవటంతో రెండు మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి రిలీజ్ లతో సీన్ మారిపోయింది. సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ అయి అన్ని మంచి టాక్ తో పాటు, మంచి వసూళ్లను కూడా రాబడుతున్నాయి. దీంతో పోటా పోటి రిలీజ్ లకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.సంక్రాంతిని తలపించే మరో భారీ పోటి త్వరలోనే మరోసారి వెండితెర మీద కనిపించనుంది. స్టార్ హీరోల సినిమాల రిలీజ్ లతో ఒక్క అడుగు వెనక్కు వేసిన కుర్ర హీరోలు ఒకేసారి బరిలో దిగటానికి రెడీ అవుతున్నాడు.
ఫిబ్రవరి 5న ఒకేసారి మూడు ఆసక్తికర సినిమాలు బరిలో దిగుతున్నాయి. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి విజయం సాధించిన నాని 'కృష్ణగారి వీర ప్రేమగాథ' సినిమాతో మరోసారి అదృష్టాన్ని పరీక్షిచుకోవడానికి రెడీ అవుతున్నాడు.అల్లుడు శీను సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'స్పీడున్నోడు'గా సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ కూడా 'కృష్ణాష్టమి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు, ఇలా మూడు సినిమాలు ఒకేసారి రిలీజ్ కు రెడీ అవుతుండటంతో మరోసారి తెలుగు సినీ అభిమానులు పండగ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







