ఇల్లీగల్ హౌస్‌మెయిడ్ హైరింగ్ రాకెట్
- January 18, 2016
ఒమన్‌లో ఇల్లీగల్ హౌస్‌మెయిడ్ హైరింగ్ రాకెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. చట్టబద్ధంగా నడుస్తున్న రిక్రూట్ ఏజెన్సీలు ఈ హైరింగ్ రాకెట్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓ హౌస్‌మెయిడ్ కోసం రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు 1000 ఒమన్ రియాల్స్ వరకూ వసూలు చేస్తున్నాయి. అలా, హౌస్‌మెయిడ్స్‌గా మారినవారు తమ బంధువుల్ని ఇల్లీగల్ ఏజెంట్లుగా మార్చి, కేవలం 500 ఒమన్ రియాల్స్‌కే హౌస్‌మెయిడ్స్‌ని అందిస్తున్నాయి. ఇది తమ ఆదాయాన్ని గణనీయంగా తగ్గించేస్తున్నాయని రిక్రూటింగ్ ఎజెన్సీలు వాపోతున్నాయి. అయితే 1000 ఒమన్ రియాల్స్ చెల్లించడం హౌస్‌మెయిడ్స్‌కి కష్టంగా మారుతోందనీ, రిక్రూటింగ్ ఎజెన్సీలు ఈ ఫీజును తగ్గించగలిగితే, తమలాంటివారి అవసరమే హౌస్‌మెయిడ్స్‌కి ఉండదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అక్రమ రిక్రూటింగ్ ఎజెంట్ చెప్పారు. అలాగే ఒమన్ కుటుంబాలు కూడా తక్కువ ఖర్చుతో వచ్చే మెయిడ్స్ కోసం ఆసక్తి చూపుతున్నారని ఇంకొందరు అన్నారు. జీతం ఇవ్వకుండా పాత యజమాని తనపై ఒత్తిడి తీసుకొచ్చాడని అంటున్న ఓ మెయిడ్, రిక్రూట్‌మెంట్ ఛార్జీలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో చేసేది లేక, ఇంకో యజమానిని వెతుక్కున్నాననీ కొత్త యజమాని సగం చెల్లించగా, మిగతా సగం తాను చెల్లించినట్లు శ్రీలంకకు చెందిన ఓ మెయిడ్ చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ వర్గాలు ఈ వివాదంపై స్పందించడానికి నిరాకరిస్తున్నాయి
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







