బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు ..
- January 18, 2016
క్యాన్సర్ పేరు వింటేనే భయపడుతుంటాం.అందులో మెదడుకు క్యాన్సర్ వచ్చిందంటే ఇక ఆందోళన చెప్పనలవి కాదు.డాక్టర్లు కూడా బ్రెయిన్ క్యాన్సర్కి సర్జరీ చేయడమే మొట్టమొదటి మార్గంగా ఎంచుకుంటారు. ఆరోగ్యకరమైన కణజాలం ప్రభావితం అయ్యే అవకాశాలుండడమే ఇందుకు కారణం.
మెదడులో మాలిగ్నెంట్ ట్యూమర్ ఏర్పడటాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అంటారు. మెదడులో ప్రారంభమై లేదా శరీర వివిధా భాగాలలో ప్రారంభమై, మెదడుకు వ్యాపిస్తుంది. అన్ని రకాల క్యాన్సర్'లు మాలిగ్నెంట్'కి చెందినవి కాదు, క్యాన్సర్'లలో చాలా రకాలు ఉన్నాయి.
మన శరీరంలో నిరంతరం పాత కణాలు చనిపోతూ కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో అవసరం లేకపోయినా కొత్త కణాలు పుడుతుంటాయి. అదేవిధంగా చనిపోవాల్సిన కణాలు అలాగే ఉండిపోతాయి. దీనివల్ల కావలసినదాని కన్నా అదనంగా కణాలు పెరుగుతాయి. ఇదే ట్యూమర్ లేదా కణితి ఏర్పడడానికి దారితీస్తుంది. ఈ ట్యూమర్లు బినైన్, మాలిగ్నెంట్ అని రెండు రకాలు. బినైన్ ట్యూమర్లలో క్యాన్సర్ కణాలు ఉండవు. కాబట్టి మెదడులో ఏర్పడే బినైన్ ట్యూమర్లు వాపును, అనారోగ్యాన్ని కలిగిస్తాయి. కానీ క్యాన్సర్ కణాలతో కూడిన ఈ మాలిగ్నెంట్ ట్యూమర్లు మాత్రం ప్రమాదకరమైనవి. ఆరోగ్యంగా ఉన్న మెదడు కణాలపై దాడిచేసి ప్రాణాపాయం కలిగిస్తాయి.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి కనిపెట్టే లక్షణాలు..!
క్యాన్సర్ సోకిన కణాలు వాటి చుట్టూ ఉండే కణాలకి సోకి, వాటిని కూడా క్యాన్సర్ వ్యాధికి భారినపడేలా చేస్తాయి. కానీ బ్రెయిన్ క్యాన్సర్'ని కలుగచేసే కారకాలు ఇంతవరకు కనుగొనబడలేదు, మీ జీవన శైలిలో మార్పులు మరియు కొన్ని రకాల ప్రమాదకర కారకాలకి దూరంగా ఉండటం వలన బ్రెయిన్ క్యాన్సర్'కి దూరంగా ఉండవచ్చు. వీటకంటే ముందు బ్రెయిన్ క్యాన్సర్ గురించి కొన్ని వాస్తవాలను తెలుకోవడం మంచిది. బ్రెయిన్ క్యాన్సర్ కు సబంధించిన వాస్తవాలను, లక్షణాలను మరియు ట్యూమర్ మరియు మరికొన్ని బ్రెయిన్ క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఈ క్రింది విధంగా తెలపడం జరిగింది.
చురకైన మెదడుకు మేత ఈ టాప్ 30 ఆహారాలే... సాధారణంగా బ్రెయిన్ క్యాన్సర్ టిష్యులు బ్రెయిన్ లో ఏర్పడటం వల్ల వస్తుంది. దీన్ని బ్రెయిన్ ట్యూమర్స్ గా పిలుస్తాము . ఈ ట్యూమర్స్ మెదడు పనితీరు మీద ప్రభావం చూపుతుంది . వీటితో పాటు కొన్ని వాస్తవాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా:
మొదట బ్రెయిన్ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకోవాలి. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడే వారిలో తలనొప్పులు, వికారంగా ఉండటం, చూపు మందగించడం, మాటలు తడబడటం, జ్ఞాపకశక్తి సమస్యలు, స్థాయీభావాల్లో తేడాలు రావడం, కాళ్లూచేతుల్లో తిమ్మిర్లు రావడం లాంటి లక్షణాలు కనబడుతాయి.
ఇది అంత్యంత సాధారణమైన బ్రెయిన్ క్యాన్సర్. దీన్నే సెంకడరీ బ్రెయిన్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఇది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు.రెండవ అంత్యంత సాధారణ బ్రెయిన్ క్యాన్సర్ గ్లియోబ్లాస్టోమా. ఇది చాలా సహజమైనట ప్రైమరీ బ్రెయిన్ క్యాన్సర్ . ఇది అత్యంత ప్రమాధకరమైనది మరియు దీనికి వెంటనే చికిత్స అవసరం అవుతుంది.
అవయవాలు దానం చేసే వారిలో బ్రెయిన్ క్యాన్సర్ ఉన్నట్లైతే అది రెండవ వ్యక్తి(అవయవగ్రహీత)లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సెకండరీ బ్రెయిన్ క్యాన్సర్ గా చెబుతారు.
బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడే వారిలో తరచూ తలనొప్పి వేధిస్తుంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే వెంటనే డాక్టర్ ను సంప్రధించాలి. ముఖ్యంగా ఉదయంపూట వచ్చే తలనొప్పి అత్యంత ప్రమాధకరమైనదిగా గుర్తించాలి.
రేడియేషన్ వల్ల కూడా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు సెల్ ఫోన్ రేడియేషన్.
బ్రెయిన్ క్యాన్సర్ కుంటుంబంలో ఎవరికైనా ఉన్నట్లైతే, కుంటుంబ సభ్యులకు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవడం మంచిది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







