వ్యాట్ చట్టానికి తుదిమెరుగులు
- January 19, 2016
గల్ఫ్ అరబ్ స్టేట్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్సెస్ (వ్యాట్) చట్టానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. 2018 నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం నేపథ్యంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సుమారు 5 శాతం వ్యాట్ విధించే దిశగా గల్ఫ్ అరబ్ స్టేట్స్ సన్నాహాలు చేస్తున్నాయి. ఆరు నేషన్స్‌తో కూడిన గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ ఈ వ్యాట్ని సంయుక్తంగా అమల్లోకి తీసుకురానుంది. జిసిసి సభ్యులు వీలైనంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జూన్ 2014 నుంచి 60 శాతం మేర చమురు ధరలు పతనమయ్యాయి. దాంతో ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం గల్ఫ్ నేషన్స్ ప్రయత్నిస్తున్నాయి. గల్ఫ్ స్టేట్స్లో దేనికదే వ్యాట్ చట్టాన్ని రూపొందించుకోనున్నప్పటికీ, అన్ని నేషన్స్ ఓ అవగాహనతో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. ఐదు శాతం వ్యాట్‌తో యూఏఈ 12 బిలియన్ దిర్హామ్‌లను సమకూర్చుకునే అవకాశం ఉంది. అయితే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ సర్వీస్ వంటి వాటిపై మాత్రం వ్యాట్ని ఇంపోజ్ చేయకూడదని భావిస్తున్నారు. 2016లో 13 శాతం ఆదాయం తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నడుమ వ్యాట్‌తో కొంతవరకు ఉపశమనం పొందవచ్చని గల్ఫ్ నేషన్స్ అనుకుంటున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







