నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రత తప్పనిసరి
- January 19, 2016
నిర్మాణ ప్రాంతాల్లో పరిశుభ్రతకు సంబంధించి దుబాయ్ మున్సిపాలిటీ స్పష్టమైన నిబంధనల్ని పేర్కొంది. మార్చ్ 1 లోగా అన్ని నిర్మాణ సంస్థలూ నిర్మాణ ప్రాంతాల్లో నిబంధనలకు అనుగుణంగా పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని హుకూం జారీ చేసింది. అపరిశుభ్రమైన వాతావరణంతో నిర్మాణ ప్రాంతాలకు పక్కనే ఉన్న ఇళ్ళులోనివారు దోమలతో, ఎలుకలతో అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని దుబాయ్ మున్సిపాలిటీ అధికారులు చెప్పారు. నిర్మాణ ప్రాంతాల్లో ముందుగా దోమలు, ఈగల నివారణ కోసం మందులు చల్లవలసి ఉంటుందనీ, అలాగే ఎలుకలు పెరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అలాగే కార్మికుల భద్రత కోసం అన్ని మెజర్‌మెంట్స్ పాలించాలని అన్నారు. రెండు మీటర్లకన్నా ఎక్కువ ఎత్తుతో ఫెన్సింగ్‌ని ఇంజనీర్ పర్యవేక్షణలో నిర్మించాలని నిబంధనలు చెబుతున్నట్లు వెల్లడించారు అధికారులు. నిర్మాణ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చవలసి ఉంటుందనీ, వాటిని కంట్రోల్ రూమ్‌కి కనెక్ట్ చేయడం ద్వారా నిబంధనల ఉల్లంఘనను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుంటందని అధికారులు వివరించారు. నిర్మాణం సందర్భంగా వ్యర్ధాల్ని పారవేయవలసి ఉంటే, తగిన పద్ధతుల్లోనే వాటిని తరలించాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







