అస్సాం ప్రజల కలలు సాకారంకు తాము సహకరిస్స్తాం : మోదీ
- January 19, 2016
అస్సాం ప్రజల కలలు సాకారమయ్యేందుకు తాము సహకరిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మంగళవారం అస్సాం పర్యటనలో ఉన్న ఆయన కోక్రాఝార్‌లో బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోక్రాఝార్కి ఏడాదిలోగా డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు రూటును పొడిగిస్తామన్నారు. తొందరలోనే భారత వైమానిక దళం, పౌరులు వాడుకునేందుకు వీలుగా అక్కడ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రతిపక్ష కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. గత పదిహేనేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. వారు అంత కాలంలో చేయలేని పనిని తాము 15 నెలల్లో చేసి చూపించామని చెప్పారు. దిల్లీ ఒక రూపాయి పంపిస్తుంటే 15 పైసలు మాత్రమే గ్రామాలకు చేరుతోందని రాజీవ్ చెప్పిన మాటల్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అస్సాం ప్రభుత్వం మాత్రం తాము చేసే ప్రతి పనికీ లెక్కలు చూపుతోందని పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అస్సాం కోసం తన వద్ద ఉన్న ఒకే ఒక పథకం 'అభివృద్ధి' అని పేర్కొన్నారు. అక్కడ రోడ్డు, రైలు, వాయు మార్గాల్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







