కిండర్‌గార్టెన్‌ తాత్కాలిక మూసివేత

- January 19, 2016 , by Maagulf
కిండర్‌గార్టెన్‌ తాత్కాలిక మూసివేత

జింగ్‌ సమీపంలోని అబుయాషీరా ఏరియాలోగల కుల్‌ అల్‌ అఫ్తాల్‌ అల్‌ చిల్డ్రన్‌ కిండర్‌ గార్టెన్‌ని తాత్కాలికంగా మూసివేసినట్లు మంత్రి త్వ శాఖ వెల్లడించింది. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఈ తాత్కాలిక మూసివేతకు కారణంగా మంత్రిత్వ శాఖ వర్గాలు వివరించాయి. పది రోజుల్లో భద్రతా లోపాల్ని సరిదిద్దేందుకు అవకాశం కూడా కల్పించారు. జనవరి 17న మూసివేతపై నిర్ణయం తీసుకున్నారు. కిండర్‌గార్టెన్స్‌లో నిత్యం తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనల్ని ఉల్లంఘించినవారిపై చర్యలు తప్పవని మంత్రిత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఆడుకోవడానికి సరైన ప్లేస్‌ లేకపోవడం, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యం వంటి అనేక లోపాలు కిండర్‌గార్టెన్లలో నిత్యకృత్యంగా మారాయని అధికారులు చెప్పారు. తాత్కాలికంగా మూసివేయబడిన కిండర్‌గార్టెన్‌ పది రోజుల్లోగా లోపాల్ని సరిదిద్దని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకోబడ్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ విషయంపై కిండర్‌గార్టెన్‌ యాజమాన్యం స్పందించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com