ఫిబ్రవరిలో విడుదల కానున్న ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’
- February 01, 2020
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్, పూర్వీ పిక్చర్స్ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ఫస్ట్ లుక్, ప్రచార చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు బాలు అడుసుమిల్లి మాట్లాడుతూ ‘‘ఆల్రెడీ రిలీజైన ట్రైలర్, పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా ప్రేక్షకులు అందరికీ థాంక్స్. మొదట మా సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కాస్త ఆలస్యం కావడం, ఇతర టెక్నికల్ సమస్యల వలన సినిమాను వాయిదా వేస్తున్నాం. ఫిబ్రవరి నెలలోనే సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. అతి త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం" అని అన్నారు. సినిమా గురించి బాలు మాట్లాడుతూ "మహానగరంలో నివసించే నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. హైదరాబాద్‌లో ఉండే ఈ నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం గోవా వెళతారు. అక్కడ ఏం జరిగింది? అనేది ఆసక్తికరం. కథ, కథనాలు కొత్త తరహాలో ఉంటాయి. ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. న్యూ ఏజ్ సినిమా ఇది’’ అని అన్నారు.
నటీనటులు:
ధన్యా బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్, రఘుబాబు, హిమజ, రఘు కారుమంచి, సమీర్ తదితరులు
సాంకేతిక నిపుణులు:
అసోసియేట్ డైరెక్టర్: లక్కీ బెజవాడ, ఎడిటర్: తెల్లగుటి మణికాంత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎల్ఎన్ వారణాసి, వైజేఆర్,
కో - ప్రొడ్యూసర్స్: నేహా మురళీకృష్ణ, రఘురామ్ యరుకుండ,
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, సినిమాటోగ్రఫీ: శేఖర్ గంగమోని, సంగీతం: వికాస్ బాడిస,
కో–డైరెక్టర్, డైలాగ్స్: విజయ్ కామిశెట్టి, నిర్మాత: హిమ బిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్,
రచన, దర్శకత్వం: బాలు అడుసుమిల్లి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







