యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు

- February 01, 2020 , by Maagulf
యూఏఈ లో మరో కరోనా వైరస్ కేసు నమోదు

యూఏఈ: చైనా నగరం వుహాన్ నుండి యూఏఈ కు వచ్చిన ఒకరిలో కరోనా వైరస్ ను ధృవీకరించింది యూఏఈ ఆరోగ్య మరియు నివారణ మంత్రిత్వ శాఖ. కాగా, వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. దీంతో ఐదు కేసులు కరోనా వైరస్ ఖాతాలో చేరాయి. 

ఇంతకుముందు గుర్తించిన నాలుగు కేసులు ఇప్పటికీ వైద్య సంరక్షణలో ఉన్నాయని,  
వారి పరిస్థితి స్థిరంగా ఉందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కనుగొనబడిన కేసులను పరిష్కరించడంలో WHO ఆదేశాలకు యూఏఈ కట్టుబడి ఉంది మరియు ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవరసం లేదని, పౌరులు మరియు నివాసితుల భద్రతను కాపాడేందుకు దేశంలో అవసరమైన అన్ని జాగ్రత్తలు మంత్రిత్వ శాఖ తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు.

సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దనీ, సరైన సమాచారం కోసం అధికారిక ప్రకటనలను ఎప్పటికప్పుడు తెలుసుకోవలసిందిగా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com