ప్రేయసిని వివాహమాడిన హీరో మహత్
- February 01, 2020
చెన్నై: బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 3 ఫేమ్ మహత్ రాఘవేంద్ర ఓ ఇంటివాడయ్యాడు. గతేడాది తన గాళ్‌ఫ్రెండ్ ప్రాచీ మిశ్రాతో మహత్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. చివరగా ఈ జంట.. శనివారం రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమిళనాడులోని ఓ బీచ్ సమీపంలో హిందూ సంప్రాదాయంలో మహత్, ప్రాచీల పెళ్లి జరిగింది. ప్రైవేటుగా జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు కొద్ది మంది సన్నిహితులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు శింభు, అనిరుధ్‌లు కూడా పెళ్లికి హాజరైన వారిలో ఉన్నారు.
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ సినిమాతో మహత్ తెలుగు ప్రేక్షకులకు పరిచయయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించాడు. తమిళ 'బిగ్‌బాస్' షోలో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించాడు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..