పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది
- January 19, 2016
పీఎస్‌ఎల్‌వీ సీ-31 ప్రయోగం వి జయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన నెల్లూరు జిల్లాలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈరోజు ఉదయం 9.31గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ31(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌకను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమై 48గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన పిదప పీఎస్‌ఎల్‌వీ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన 1,425 కిలోల ఐఆర్ ఎన్‌ఎస్‌ఎస్-1ఇ ఉప గ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ సీ31 వాహకనౌక 19 నిమిషాల 30సెకన్లలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2016 తొలి అంకంలో ఇస్రో సాధించిన ఘన విజయమని శాస్రవేత్తలు ప్రకటించారు. పీఎస్‌ఎల్‌వీ మరోసారి నమ్మకాన్ని నిలబెట్దిందని పేర్కొన్నారు. మరో రెండున్న నెలల్లో మిగతా 2 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని తెలిపారు. 2016 చివరినాటికి స్వదేశీ దిక్చూచిని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. తాజా ఉపగ్రహంతో గ్లోబల్ పొజిషినింగ్ సిస్టమ్(జీపీఎస్)కు మరింత వూతం లభించనుంది. భూ స్థిర కక్ష్యకు 36వేల కిలోమీటర్ల ఎత్తున ఉపగ్రహాన్ని రోదసీలో నిలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







