చిక్కుడు గింజలతో ఆరోగ్యం..
- January 19, 2016
చిక్కుడులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. రోజు వారీ డైట్ లో చిక్కుడు గింజలు చేర్చుకుంటే.. డయాబెటీస్, రక్తహీనతకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీటిని రోజూ తీసుకోవాలంటే బోర్ గా అనిపించవచ్చు. కాబట్టి.. ఒక్కో రోజు ఒక్కో విధంగా తీసుకుంటే మంచిది. ఉడికించిన గింజల రూపంలో, కూర రూపంలో ఏదో ఒక రూపంలో మీ ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.షుగర్ వ్యాధి కంట్రోల్ చేసే శక్తి మెంతులకే సొంతం..చిక్కుడు కాయ సాధారణంగా తింటూ ఉంటాం. అయితే.. చిక్కుడు గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజువారీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ప్రతిరోజూ అరకప్పు చిక్కుడు గింజలు తింటే.. శరీరంలో చేరే చెడు కొలెస్ర్టాల్ 5 శాతం తగ్గించి, మేలు చేసే కొలెస్ర్టాల్ ని 2.3 శాతం తగ్గిస్తుంది. చిక్కుడు తింటే.. ఆకలి కూడా తగ్గుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.చిక్కుడు గింజలు రక్తంలోని షుగర్ లెవెల్స్ ని స్థిరపరుస్తాయి. అయితే చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకున్న మొదట్లో కాస్త కడుపులో ఉబ్బరంగాఅనిపిస్తుంది. క్రమంగా గ్యాస్ ఏర్పడటం నుంచి ఉపశమనం పొంది, త్వరగా జీర్ణమవడానికి సహాయపడతాయి. కాబట్టి రోజుకి అరకప్పు చిక్కుడు గింజలు తినడం అలవాటు చేసుకుని.. ఆరోగ్యంగా ఉండండి.కొలెస్ట్రాల్ గురించి తప్పుగా భావించబడే కొన్ని అపోహలు!రోజూ తినడానికి ఇష్టపడని వాళ్లు కనీసం వారానికి 4 సార్లు చిక్కుడు గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22 శాతం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చిక్కుడు గింజల ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా పొందవచ్చు. అయితే ముదురు రంగు గింజల్నే ఎంచుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







