రాహుల్ థక్కర్ ఆస్కార్ గెలుచుకున్నారు
- January 20, 2016
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కింది. టెక్నికల్ అచీవ్మెంట్ విభాగంలో రాహుల్ థక్కర్ అనే భారత సంతతి వ్యక్తి ఆస్కార్ గెలుచుకున్నారు. ఫిబ్రవరి 13న జరిగే వార్షిక సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డుల ప్రదానోత్సవంలో రాహుల్ ఈ అవార్డును అందుకోనున్నారు. సాధారణంగా ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. అయితే అంతకంటే ముందుగానే.. ఫిబ్రవరి 13న సైంటిఫిక్ అండ్ టెక్నికల్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది. ఈ విభాగంలో పది అవార్డులను అందజేస్తారు. ఆరోజే రాహుల్ ఈ అవార్డును అందుకోనున్నారు. అద్భుతమైన డిజైన్ల ద్వారా సినిమా రంగానికి విశేష సేవలందించినందుకుగానూ.. రాహుల్ను ఈ అవార్డు వరించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







