11,000 మందికి పైగా ఖైదీల అప్పులు తీర్చబడ్డాయి!

- February 11, 2020 , by Maagulf
11,000 మందికి పైగా ఖైదీల అప్పులు తీర్చబడ్డాయి!

11,000 మందికి పైగాఖైదీల అప్పులు క్లియర్‌ అయ్యాయి. మొత్తం 6.84 మిలియన్‌ దిర్హాముల 
డొనేషన్స్‌ వివిధ ఛారిటీ సంస్థలు, ఫిలాంత్రపిస్ట్‌ల ద్వారా ఈ క్లియరెన్స్‌ జరిగినట్లు దుబాయ్‌ పోలీస్‌ వెల్లడించింది. హ్యుమానిటేరియన్‌ అప్రోచ్‌లో భాగంగా ఈ విరాళాలు అందాయనీ, అవి ఖైదీలకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయని అధికారులు పేర్కొన్నారు. దుబాయ్‌ పోలీస్‌ - కరెక్షనల్‌ అండ్‌ ప్యునిటివ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ డైరెక్టర్‌ జనరల& బ్రిగేడియర్‌ అలి మొహమ్మద్‌ అల్‌ షమాలి మాట్లాడుతూ, ఖైదీలు సన్మార్గంలోకి రావడానికి ఈ తరహా ఛారిటీస్‌కి దుబాయ్‌ పోలీస్‌ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com