షార్జా లో వైఫై సంకేతాలతో పనిచేసే సౌరశక్తీ చెత్త కుండీలు

- January 20, 2016 , by Maagulf
షార్జా లో  వైఫై సంకేతాలతో పనిచేసే సౌరశక్తీ చెత్త కుండీలు

షార్జా లో  అత్యంత రద్దీ గల ప్రాంతాల్లో సౌరశక్తీ ఆధారిత వందల  చెత్త కుండీలను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయనున్నారు. బీఅహ్ ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వాహణ సంస్థ ఎమరేట్స్ లో  విన్నూత్న యత్నానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. ఫోటోవోల్టిక్ ప్యానళ్ళ ద్వారా చెత్త కుండీలో విద్యుత్ ఉత్పత్తి  కాబడి 40 మీటర్ల పరిధిలో వైఫై సంకేతాల సంగ్రహిస్తుంది. చెత్త కుండీలలో చెత్త పెరుకుపోయినపుడు అందులో ఉన్న సెన్సర్లు ఈ సమాచారాన్ని కంట్రోల్ రూం కు  తెలియచేస్తాయి. ఈ స్మార్ట్  చెత్త కుండీలు వైఫై సంకేతాలకు  హాట్ స్పాట్ గా పనిచేస్తాయి. మెరుగైన పారిశుద్య నిర్వహణ కోసం షార్జాలో ఏర్పాటుకానున్నాయి. రానున్న నెలల్లో విశ్వవిద్యాలయాల్లోను , అల్ కస్స ప్రాంతాలలో తొలుత ప్రారంభిస్తారు.గత ఏడాది లండన్ , న్యూయార్క్ నగరాల్లో మొదలై ఎంతో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయి.  

           

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com