ఇండియన్ ఐడల్ 11 విన్నర్‌గా సన్నీ హిందూస్తానీ
- February 24, 2020
ఇండియన్ ఐడల్ 11 విన్నర్‌గా బతిందాకు చెందిన సన్నీ హిందూస్థానీ నిలిచాడు. సీజన్‌లో నుశ్రాత్ అలీ ఖాన్ పాటలను దాదాపు అదే రేంజ్‌లో పాడాడు. ట్రోఫీతో పాటు T-సిరీస్ రూ.25లక్షల ప్రైజ్ మనీ అందుకున్నాడు సన్నీ. అఫ్రీన్.. అఫ్రీన్ పాటతో ఆడిషన్ రోజు నుంచి జడ్జిలను మెస్మరైజ్ చేస్తూ వచ్చిన సన్నీకి ఆనంద్ మహీంద్రా కూడా ఫ్యాన్ అయిపోయాడు. ఆడిషన్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్టు చేశాడు.
ఫినాలె నైట్.. సన్నీ చాలా పాటలు పాడాడు. మేరే రష్కే ఖమర్, హల్కా హల్కా సరూర్ పాటలు కిరాక్ పుట్టించాయి. ఈ స్థాయికి రావడానికి సన్నీ పడ్డ కష్టాన్ని స్క్రీన్‌పై చూసి ఆయుష్‌మాన్ కంటతడి పెట్టుకున్నారు. 'ఈ స్థాయికి రావడానికి నేను పడ్డ కష్టం అందరికంటే ఎక్కువ అని ఫీలయ్యేవాడిని. ఇతనితో పోల్చుకుంటే అన్నీ చిన్నవే అనిపిస్తుంది. ఇంత టాలెంట్‌తో ఎక్కడి నుంచి వచ్చాడు. అతని తల్లి చాలా గొప్పది' అంటూ పొగడ్తలు కురిపించాడు.
ఫస్ట్ రన్నరప్ సాధించిన రోహిత్ రౌత్, సెకండ్ రన్నరప్ అంకోనా ముఖర్జీలకు చెరో ఐదు లక్షలు వచ్చాయి. 4, 5 స్థానాల్లో నిలిచిన రిధమ్ కళ్యాన్, అద్రిజ్ ఘోష్‌లకు చెరో రూ.3లక్షల వచ్చాయి. ఫైనల్ కు చేరిన ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల చెక్కును అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







