మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్‌డాన్ రవి పూజారి అరెస్ట్
- February 24, 2020
మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్‌డాన్ రవి పూజారిని కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌతాఫ్రికాలో అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి బెంగుళూరు తీసుకువచ్చారు. 200కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా రవి పూజారి విచారిస్తున్నారు. మర్డర్లు, దోపిడిలతో పాటు బాలీవుడ్ బిగ్ షాట్స్ ను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు రవి పూజారపై ఆరోపణలు ఉన్నాయి.
చోటారాజన్ దగ్గర శిష్యరికం చేసి… దావూద్ ఇబ్రహీం దగ్గర డాన్ ఎలా చలామణి కావాలో ఎలా బెదిరించాలో ఒంటబట్టించుకున్నాడు. తర్వాత తానే సొంతంగా గ్యాంగ్ ఏర్పాటు చేసుకొని అండర్ వరల్డ్ డాన్ అయ్యాడు. మర్డర్ లు, సెటిల్మెంట్లు, దోపిడిలు, బెదిరింపులకు పాల్పడుతూ డాన్ గా అవతరించాడు. బాలీవుడ్ లో అతని పేరు చెబితేనే వణికిపోయేంతగా ఎదిగిపోయాడు.
20 ఏళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కర్నాటకలో అతనిపై కుప్పులుతెప్పులుగా కేసులు నమోదయ్యాయి. ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న డాన్ ఎట్టకేలకు పట్టుడ్డాడు. సౌతాఫ్రికా, సెనెగల్, ఇండియన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పూజారి రవిని అరెస్ట్ చేశారు. విచారణలో మరికొందరు బడాబాబుల చీకటి బండారం బయటకొస్తుందని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







