'నాని' హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'
- February 24, 2020
నాచురల్ స్టార్ 'నాని' హీరోగా 'జెర్సీ' వంటి ఘనవిజయం సాధించిన, వైవిధ్యమైన ఉత్తమ కధా చిత్ర్రాన్ని నిర్మించిన యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి 'నాని' హీరోగా చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
'టాక్సీ వాలా' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ. కాగా ఈ చిత్రానికి 'శ్యామ్ సింగ రాయ్' ' అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర కథానాయకుడు నాచురల్ స్టార్ 'నాని' పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్ర యూనిట్. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని, వీడియోను తమ అధికారిక సామాజిక మాధ్యమం అయిన యు ట్యూబ్ ద్వారా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో 2020 డిసెంబర్ 25 న చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించారు. హీరో 'నాని' కి ఇది 27 వ చిత్రం. చిత్రం ప్రారంభం,చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
ఈ చిత్రానికి సమర్పణ పి.డి.వి.ప్రసాద్, నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
తాజా వార్తలు
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..







