'ఈ కథలో పాత్రలు కల్పితం' చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పృద్వి రాజ్
- February 24, 2020
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్టైన్మెంట్స్ బేనర్ పై అభిరామ్ ఎం. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన, లక్కి హీరోయిన్స్. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం నుండి నటుడు పృద్విరాజ్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ...
"మా హీరో పవన్ తేజ్ కొణిదెలకి "ఈ కథలో పాత్రలు కల్పితం" మొదటి సినిమా అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ లా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. దర్శకుడు అభిరామ్ మేకింగ్ ఫ్రెష్ గా ఉంది. 'జెస్సీ' కి సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ విజువల్స్, 'ఆర్ఎక్స్ 100', 'కల్కి' చిత్రాలకు డైలాగ్స్ రాసిన తాజుద్దీన్ సయ్యద్ మాటలు ఈ చిత్రానికి హైలెట్ గా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాము. ఈ మూవీలో నటుడు పృద్వి రాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్ర సినిమాకు హైలెట్ కానుంది. ఈ సందర్భంగా పృద్వి లుక్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఈ మూవీ నుండి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. సినిమా బాగా వస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ మూవీ ఆడియన్స్ ను అలరించబోతోందని తెలిపారు.
పవన్ తేజ్, మేఘన, లక్కి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ ఎన్, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్, ఫైట్స్: షావోలిన్ మల్లేష్, ఆర్ట్: నరేష్ బాబు తిమ్మిరి,మాటలు: తాజుద్దీన్ సయ్యద్, కాస్ట్యూమ్ డిజైనర్: సియ డిజైనర్స్, కో-డైరెక్టర్: కె. శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి, లైన్ ప్రొడ్యూసర్: దుర్గా అనీల్ రెడ్డి, నిర్మాత: రాజేష్ నాయుడు, రచన, దర్శకత్వం: అభిరామ్ ఎం.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







