యూరోలు, దిరామ్స్ని కలిగిన ఓ వ్యక్తి అరెస్ట్..
- January 21, 2016
పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని కలిగిన ఓ వ్యక్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు నేడు ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. రూ. కోటి విలువ గల విదేశీ కరెన్సీ(యూరోలు, దిరామ్స్)ని కలిగిన ఓ వ్యక్తి ఎయిర్ అరేబియా విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న ఇంటలిజెన్స్ అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. కాగా కస్టమ్స్ నిబంధనల ప్రకారం ఓ వ్యక్తి తన వెంట 5 వేల యూఎస్ డాలర్స్‌ను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతి ఉంది. వీటితో పాటు మరో 5 వేల డాలర్ల విలువ గల బాండ్లు, చెక్స్‌ను తీసుకువెళ్లవచ్చు. పరిమితికి మించి నగదును తీసుకువెళ్తుండటంతో వ్యక్తిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపట్టారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







