ఖతార్,అల్జీరియా మధ్య ద్వైపాక్షిక,వాణిజ్య ఒప్పందాలపై చర్చ
- February 26, 2020
అల్జీర్స్:అల్జీరియా పర్యటనలో ఉన్న ఖతార్ ఆమీర్ హెచ్ హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ కు ఆ దేశ ప్రభుత్వం సాదర స్వాగతం పలికింది. హౌరి బౌమీడిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆమీర్ సైనిక గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అల్జీరియా ప్రెసిడెంట్ హెచ్ ఇ అబ్దేల్‌మద్జిద్ టెబ్బౌన్ తో అల్జీర్స్‌లోని ఎల్ మౌరాడియా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో జరిగిన అధికారిక సమావేశంలో ఆమీర్ పాల్గొన్నారు. ఖతార్, అల్జీరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలతో పాటు అర్ధిక రంగంలోని పలు కీలక అంశాలపై చర్చించారు. ఎనర్జీ, ఎకనామీ, పెట్టుబడులతో పాటు స్పోర్ట్స్, కల్చర్ రంగాల్లో పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకుంటూ డెవలప్మెంట్ సాధించే అంశాలపై డిస్కస్ చేశారు. అలాగే పాలస్తీనా, లిబియా సంక్షోభం వంటి అంతర్జాతీయ పరిణామాలపై కూడా ఇరువురు దేశాధినేతలు డిస్కస్ చేశారు. ఈ సందర్భంగా ఆమీర్ మాట్లాడుతూ..అరబ్ సమాజానికి అల్జీరియా చేస్తున్న సాయాన్ని మరువలేమని ప్రశంసించారు. అల్జీరియాలో త్వరలో జరగబోయే అరబ్ సమ్మిట్ సక్సెస్ కావాలని ఆయన అకాంక్ష వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







