సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ

- February 26, 2020 , by Maagulf
సీఎం జగన్‌తో టాలీవుడ్‌ అగ్ర నిర్మాతల భేటీ
 తాడేపల్లి:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ అగ్ర నిర్మాతలు భేటీ అయ్యారు. దగ్గుబాటి సురేష్ బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, వల్లభనేని వంశీ, నల్లమలుపు బుజ్జి, జెమిని కిరణ్ తదితరులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రిని కలిశారు.
భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘మేము ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఆరు సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ సృష్టించిన విలయానికి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి కోసం సినీ పరిశ్రమ కొన్ని నిధులను సేకరించింది. దాదాపు రూ. 15కోట్ల వరకు నిధులు వచ్చాయి. ఆ నిధులను వెచ్చించి కొన్ని ఇళ్లతో గృహసముదాయాన్ని నిర్మించాం. ఆ ఇళ్లను ప్రారంభించాలని సీఎం జగన్‌ను కలిసి ఆహ్వానించాం. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించార’ని తెలిపారు. కాగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ కూడా సినీ పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com