క్యామెల్ ట్రెక్: 10 రోజులు 500 కిలోమీటర్లు
- January 22, 2016
హమాద్ బిన్ మహమ్మద్ హెరిటేజ్ సెంటర్ ఆధ్వర్యంలో క్యామెల్ ట్రెక్ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి పది రోజులపాటు ఈ క్యామెల్ ట్రెక్ కొనసాగనుంది. ప్రతి రోజూ 50 కిలోమీటర్ల మేర క్యామెల్ ట్రెక్కింగ్ ఉంటుంది. మొత్తం పదిరోజులు కావడంతో 500 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ జరుగనుంది. ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమయ్యే ట్రెక్కింగ్, మధ్యాహ్నం 12 గంటలకు విరామం తీసుకుంటుంది. రెండు గంటలపాటు విరామం అనంతరం తిరిగి ప్రారంభమై, సాయంత్రం ఐదు గంటలకు ముగుస్తుంది. సాయంత్రం ట్రెక్కింగ్ ముగిశాక రాత్రి బస ఏర్పాట్లు టెంట్లలోనే ఉంటాయి. తిరిగి ట్రెక్కింగ్ ఉదయాన్నే ప్రారంభమవుతుంది. అందుబాటులో టెక్నాలజీ ఉండదు. ఇతరత్రా ఎలాంటి టెన్షన్లకు తావుండదు. కొత్త లోకంలోకి ఎంచక్కా ఎంటర్ అయిపోవచ్చు. యూఏఈ హెరిటేజ్ మరియు హిస్టరీని ప్రమోట్ చేసే దిశగా ఈ ట్రెక్కింగ్ చేపట్టినట్లు హెచ్హెచ్సి వర్గాలు చెప్పాయి. పెద్ద సంఖ్యలో ఈసారి ఎమిరేటీస్, వలసదారులు క్యామెల్ ట్రెక్‌లో ఉల్లాసంగా పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







