దుబాయ్ : స్పెషల్ లోగోతో 4 నెలల్లో మిలియన్ వీసాల జారీ..దుబాయ్ బ్రాండ్ పెంచటమే టార్గెట్
- March 08, 2020
గల్ఫ్ కంట్రీస్ తో పాటు వరల్డ్ వైడ్ గా దుబాయ్ బ్రాండ్ ను పెంచేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్తగా థింక్ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగోతో వీసాలను జారీ చేసింది. గత నాలుగు నెలల్లోనే లోగోతో కూడిన పది లక్షల వీసాలను జారీ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారనర్స్ అఫైర్స్ (GDRFA-Dubai) ప్రకటించింది. 'దుబాయ్- క్యాపిటల్ అఫ్ అరబ్ మీడియా 2020' లోగో ద్వారా గల్ఫ్ కంట్రీస్ లో మీడియా వరల్డ్ లో దుబాయ్ లీడర్ షిప్ ను చాటి చెప్పింది. అలాగే రీజినల్ గా మీడియా ఇండస్ట్రీ గ్రోత్ కు ఇది ఎంతగానో దోహదపడుతుందని భావిస్తోంది. అయితే..యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ విజన్ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా కౌన్సిల్ ఆఫ్ అరబ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్స్ నుంచి దుబాయ్ కి ఉన్న గుర్తింపు హైలెట్ చేయటం తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. దాంతో పెట్టుబడులు రావటంతో పాటు దుబాయ్ టూరిజమ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేసుకునే వీలుంటుంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







