దుబాయ్ లో ఏడేళ్ల హైదరాబాదీ బాలుడికి క్యాన్సర్..ఔదార్యం చూపించిన ప్రిన్స్

- March 08, 2020 , by Maagulf
దుబాయ్ లో ఏడేళ్ల హైదరాబాదీ బాలుడికి క్యాన్సర్..ఔదార్యం చూపించిన ప్రిన్స్

దుబాయ్ లో ఉంటున్న హైదరాబాదీ కుటుంబానికి అనుకోని కష్టం వచ్చింది. ఫ్యామిలీలో చిన్నవాడైన ఏడేళ్ల బాలుడు అబ్దుల్లా హుస్సేన్ క్యాన్సర్ వచ్చింది. ప్రస్తుతం అది మూడో దశలో ఉంది. అయితే..మృత్యువుతో పోరాడుతున్న అతనికి ఓ విష్ ఉంది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హద్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ను ఒక్కసారైన నేరుగా కలవాలని, అతనితో ముచ్చటించాలని, అతని పెట్స్ తో ఆడుకోవాలని, యువరాజు డ్రెస్సులను చూడాలన్నది అతని కోరిక. టీవీలో యువరాజును చూస్తూ అతనికి ఫ్యాన్ అయ్యాడు అబ్దుల్లా హుస్సేన్. క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ చాలా కూల్ పర్సన్ అంటూ తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు చిన్నారి. అలాగే నేను మీకు బిగ్ ఫ్యాన్ షేక్ హమ్దాన్, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నాను అంటూ మీడియాలో తన ఆశను బ్యానర్ ద్వారా తెలియజేశాడు.

హైదరాబాద్ కు చెందిన అబ్దుల్లా హుస్సేన్ కుటుంబం కొన్నేళ్లుగా దుబాయ్ లో ఉంటోంది. అతని తండ్రి వ్యాపారి. సోషల్ మీడియా ద్వారా అబ్దుల్లా హుస్సేన్ కోరికను తెలుసుకున్న క్రౌన్ ప్రిన్స్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బాలుడి కుటుంబాన్ని ఆహ్వానించి...అబ్దుల్లా హుస్సేన్ కుటుంబంతో దాదాపు 15 నిమిషాల పాటు ముచ్చటించారు. అబ్దుల్లాను హగ్ చేసుకొని అతనికి ధైర్యం చెప్పారని అతని తల్లి ఫాతిమా తెలిపారు. అతని రియల్ లైఫ్ హీరోను చూడగానే అబ్దుల్లా ఆనందంతో ఉప్పొంగిపోయాడని, ఆ అద్భుత క్షణాలను మరిచిపోలేమన్నారు. యువరాజు తమతో ఓ సాధారణ వ్యక్తిలా మాట్లాడిన తీరు తమకు ఎప్పటికీ గుర్తిండిపోతుందని అన్నారు.  అబ్దుల్లా హుస్సేన్ ధైర్యవంతుడని, అతనికి కుటుంబం ఎప్పటికీ అండగా ఉంటూ పాజిటీవ్ భావాన్ని పెంపొందించాలని తమకు యువరాజు సూచించినట్లు అబ్దుల్లా సోదరుడు తెలిపాడు. షేక్ హమ్దాన్ తో ముచ్చటించిన తర్వాత అబ్దుల్లా దాదాపు ఓ గంట పాటు యువరాజు పెట్స్ తో టైం స్పెండ్ చేశాడు. జిరాఫీ, ఎనుగులకు మేత వేసి సంబరపడిపోయాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com