మస్కట్‌లో ఇండియన్ ఎంబసీ యోగా సెషన్
- January 22, 2016
ఇండియన్ ఎంబసీ లాన్స్‌లో జనవరి 18న ఒమన్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ యోగా సెషన్‌ని నిర్వహించింది. ఒత్తిడి నుంచి ఉపశమనానికీ, మెరుగైన జీవనానికీ యోగా ఎంతో ఉపయోగపడ్తుందని ఇర్వాహకులు తెలిపారు. యోగా నిపుణులు, మిడిల్ ఈస్ట్ విమెన్ ఆఫ్ ది ఇయర్ 2015 పురస్కార గ్రహీత ఇమాన్ ముత్లాక్ బేసిక్ యోగా పోస్చర్స్ మరియు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లను చేసి చూపించారు. కౌషాని దేశాయ్ ఆయుర్వేద పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఒడిస్సీ డాన్స్ పెర్ఫామెన్స్, యోగాపై షార్ట్ ఫిలిం ప్రదర్శించారు. పలువురు ఈ యోగా సెషన్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగా పట్ల అవగాహన పెరుగుతోంది. అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పించడంతోపాటు, శారీక సమస్యలతో రోగాల బారిన పడకుండా ఉండేందుకు యోగా ఉపకరిస్తుందని ఎన్నో ప్రయోగాలూ స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







