పర్యాటక ఆకర్షణగా షార్జా మార్కెట్
- January 22, 2016
షార్జా కొత్త వెజిటబుల్ ఫిష్ మరియు ఫ్రూట్ మార్కెట్ ఎమిరేట్‌లో లేటెస్ట్ టూరిజం ల్యాండ్ మార్క్‌గా అవతరించింది. 138,000 మంది కేవలం రెండు వారాల్లో ఈ మార్కెట్‌ని సందర్శించారు. గత డిసెంబర్‌లో ఈ మార్కెట్ ప్రారంభమైంది. పలువురు స్కూల్ విద్యార్థులు తాజాగా ఫీల్డ్ ట్రిప్‌లో భాగంగా సౌక్ అల్ జుబైల్ మార్కెట్‌ని సందర్శించారు. 37,000 చదరపు మీటర్ల స్పేస్‌తో విశాలమైన ఈ మార్కెట్, రెండు అంతస్తుల్లో నిర్మించబడింది. ఫిష్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ మరియు ఫ్రెష్ మీట్ అమ్మకాల విభాగాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మార్కెట్‌కి సంబంధించిన ఔట్ డోర్ సెక్షన్‌ని కూడా సందర్శంచి, అక్కడి పరిస్థితులపై అవగాహన పెంచుకున్నారు. విద్యార్థులు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవడానికి రావడం ఆనందంగా ఉందని, షార్జా మార్కెట్ పర్యాటక ఆకర్షణగా మారడం గొప్ప విషయమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







