కువైట్:ప్రవాసీయులకు మెడికల్ టెస్ట్ స్టార్ట్..ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరికీ మెడికల్ చెకప్
- March 12, 2020
కువైట్:కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తుండటంతో కువైట్ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఫారెన్ నుంచి వచ్చిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కువైట్ లోకి ప్రవేశించిన విదేశీయులు అందరికీ మెడికల్ చెకప్ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 27 తర్వాత వచ్చిన వారందరు ఖచ్చితంగా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. మిష్రఫ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్ లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. గురువారం ఉదయం నుంచి మెడికల్ చెకప్ డ్రైవ్ చేపట్టింది. ఈజిప్టియన్స్, లెబనిస్, సిరియన్స్ కి ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టింది. ఇండియాతో సహా 23 వైరస్ ఎఫెక్టెడ్ దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలని కువైట్ తెలిపింది.
--దివాకర్ (మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







