దుబాయ్:ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి Dh1.5 మిలియన్ల ఎకనామిక్ స్టిములస్ ప్యాకేజీ

- March 13, 2020 , by Maagulf
దుబాయ్:ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి Dh1.5 మిలియన్ల ఎకనామిక్ స్టిములస్ ప్యాకేజీ

దుబాయ్:కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచ దేశాలు ఆర్ధికంగా కూడా పతనం అవుతున్నాయి. ఈ సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ఆయా దేశాలు ఆర్ధిక ఉద్ధీపన ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బ్రిటన్, ఇటలీ, అమెరికా స్టిములస్ ప్యాకేజీలతో ఆర్ధిక వ్యవస్థలోకి బిలియన్ల డాలర్లను ఇంజెక్ట్ చేస్తున్నాయి. లేటెస్ట్ గా దుబాయ్ కూడా అదే కోవలోకి వచ్చింది. కరోనా కారణంగా మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా Dh1.5 బిలియన్లతో ఉద్ధీపన ప్యాకేజీ ప్రకటించింది. దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ప్యాకేజీపై ప్రకటన చేశారు. అలాగే ఈ గడ్డు సమయంలో పౌరులు, నివాసితులు ఆర్ధిక వ్యవస్థకు పెట్టుబడిదారులకు మద్దతుగా నిలబడాలని కోరారు. కమర్షియల్ సెక్టార్, రిటైల్, ఎక్స్ ట్రనల్ ట్రేడ్, టూరిజమ్, ఎనర్జీ సెక్టార్ తరహా 15 రంగాలకు ఆర్ధిక చేయూతను అందించనున్నారు. అలాగే టూరిజమ్, రిటైల్, ఎక్స్ ట్రనల్ ట్రేడ్, లాజిస్టిక్ సర్వీస్ సెక్టార్ రంగాల్లో వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేలా ఆయా రంగాల్లో ఇన్వెస్టర్లను ఆకర్షించేలా చర్యలు చేపట్టారు. మొత్తం మూడు నెలల పాటు ఉద్దీపన్ ప్యాకేజీ ఎఫెక్ట్ లో ఉంటుంది. ఆ తర్వాత మరోసారి ఆర్ధిక గమనంపై సమీక్ష జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com