కరోనా ఎఫెక్ట్ : దుబాయ్ వరల్డ్ కప్ కు ప్రేక్షకులు నాట్ అలౌడ్
- March 13, 2020
కరోనా ఎఫెక్ట్ దాదాపు ప్రతీ రంగంపై ప్రభావం చూపిస్తోంది. ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ, క్రీడా రంగాలపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అవగా..మరికొన్ని ఈవెంట్స్ ఆడియన్స్ లేకుండా పేలవంగా జరిగిపోయాయి. ఇప్పుడు దుబాయ్ వరల్డ్ కప్ 2020కి కూడా కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి. మైదాన్ వేదికగా జరిగే దుబాయ్ వరల్డ్ కప్ ప్రేక్షకులకు అనుమతి లేదని దుబాయ్ రేసింగ్ క్లబ్ ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 25న జరగాల్సిన పోస్ట్-పొజిషన్ డ్రా, మార్చి 26న జరగాల్సిన బ్రేక్ ఫాస్ట్ విత్ ది స్టార్స్, వెల్కం రిసెప్షన్ సహా అన్ని సపోర్టింగ్ ఈవెంట్స్ ను రద్దు చేశారు. కేవలం హార్స్ కనెక్టర్స్, రేసింగ్ అఫిషియల్స్, అక్రిడిటెడ్ మీడియా పర్సన్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







