అబుదాబి, షార్జా, దుబాయ్‌కు విమానాలు రద్దు చేసిన ఇండిగో
- March 15, 2020
ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం మోగిస్తోంది. కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 5 వేల 800 దాటింది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ లో నిన్న కరోనాతో చనిపోయిన వారి సంఖ్య అధికంగా ఉంది. మరోవైపు బ్రిటన్ లో అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా కరోనా సోకింది. భారత ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇక స్థానికంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్.. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను మూసివేస్తున్నారు. ఇదే సందర్భంలో ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థ.. ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల మార్చి 17వ తేదీ నుండి తదుపరి ఆదేశాల వరకు తమ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా అబుదాబి, షార్జా, దుబాయ్‌కు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?