మనవి... !!
- January 24, 2016
సామాన్యుడి సంతోషాన్ని కాదనే హక్కు ఎవరికి లేదని నా అభిప్రాయం .. గొప్పవారు తమ విలాసాలకు, విందులకు,పడకలకు అయ్యే ఖర్చును కాస్త తగ్గించుకుంటే చాలు ఎప్పుడు గుర్తుకే రాని గిరిజనుల చలి బతుకుల చావులు ఇప్పుడు గుర్తుకు వచ్చినందుకు చాలా సంతోషం .. గొప్పవారి రాకకు పోసే పూల ఖర్చు లేకుండా చేస్తే చాలు బోలెడు కంబళ్ళు కొత్తవి వస్తాయి .. వారి ఖరీదైన జీవితాలకు అయ్యే ఖర్చులో కాస్త చాలు గిరిజన బతుకులు బాగుపడటానికి .. దీని కోసం సామాన్యులు చిన్న చిన్న ఆనందాలు కోల్పోనక్కరలేదు .. గిరి పుత్రులకు కొత్తగా వచ్చిన చలి పంజా కాదు కదా ఇది .. రాజకీయ నాయకులతో పాటు పీఠం అధిపతులకు కూడా సామాన్యులపై ప్రేమలు ఉప్పొంగుతున్నాయి .. మరి మంచికో.. మరోకందుకో ... ఏదైతేనేం వారి వారి వెనుక సొమ్ములను సామాన్యులకు అందించి సుతిమెత్తని పూలను కాలి కింద నలిపి వేయక ఆ సొమ్ములను సామాన్యులకు అందించమని మనవి... !!
--మంజు యనమదల
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









