ఉల్లి కాడల రైస్
- January 24, 2016
కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 12, పచ్చిబఠాణి - పావుకప్పు, పొడి అన్నం - 1 కప్పు, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, పసుపు - అర టీ స్పూను, వాంగిబాత్ / సాంబారు పొడి - ఒకటిన్నర స్పూను, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, మినపప్పు - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి, నేతిలో వేగించిన జీడిపప్పు - 10.
తయారుచేసే విధానం: ఉల్లికాడలు శుభ్రంచేసి సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టుకుని (కొద్దిసేపు నీటిలో నానబెట్టిన) పచ్చిబఠాణి, ఉల్లికాడలు వేయాలి. ఉల్లి కాడలు తరుగు దోరగా వేగిన తర్వాత పసుపు, సాంబారు / వాంగీబాత్ పొడి చల్లి రెండు నిమిషాలు వేగించి ఉప్పు, అన్నం కలపాలి. చల్లబడ్డ తర్వాత నిమ్మరసం కలిపి జీడిపప్పుతో అలంకరించాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









