మ్యూజిక్ వల్ల మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం..

- January 24, 2016 , by Maagulf
మ్యూజిక్ వల్ల మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం..

మీకు సంగీతం వినడమంటే ఇష్టమా ? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే. ఎందుకంటే.. మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం బావుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది.. షార్ప్ అండ్ యాక్టివ్ గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్ లో ఉన్నా.. కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే.. హాయిగా ఊపిరిపీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఓదార్పుని.. ఆహ్లాదాన్ని ఇస్తాయి. అలసట ఆమడదూరం పారిపోయేలా మ్యూజిక్ మ్యాజిక్ చేస్తుంది. సంగీతం వింటుంటే.. శరీరం కూడా.. ఉల్లాసంగా ఉంటుంది. ఇంతేనా.. మ్యూజిక్ వింటే.. ఇంకా ఎన్నో అమేజింగ్ బెన్ఫిట్స్ ఉన్నాయని సైంటిట్స్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా.మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డొపామైన్ అనే రసాయనం రిలీజ్ చేయడం వల్ల.. సంతోషంగా ఫీలవుతారు. సంగీతం వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. ఎప్పుడైనా.. ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఓ 15 నిమిషాల పాటు.. మ్యూజిక్ వినండి. మ్యూజిక్ వింటూ పరుగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్ల కంటే.. మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరుగెత్తవచ్చు. అనారోగ్యానికి, వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం. కాబట్టి మ్యూజిక్ వినడం అలవరుచుకోండి. సంగీతం మనసుకు ఉల్లాసాన్నే కాదు.. ఒత్తిడిని తగ్గించగలదు. మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధినోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. అలసటగా అనిపిస్తే.. వెంటనే రేడియో ఆన్ చేయండి.. ఎక్కడలేని ఉత్సాహం పొందవచ్చు. 45 నిమిషాలు శాస్త్రీయ సంగీతం వింటే.. రిలాక్సేషన్ తో పాటు.. మంచి నిద్ర వస్తుందని.. సైంటిస్ట్ లు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటే.. పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి.. హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్ తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్ గా ఫీలయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువగా తినాలి అనుకునే వాళ్లకు మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి.. తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే.. ఈ సారి భోజనం చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి. మీకు తెలియకుండానే తక్కువగా తింటారు. ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలా మంది చిరాకు పడుతుంటారు. అలాంటప్పుడు కాస్త మెలోడీ ట్యూన్స్ వింటూ డ్రైవ్ చేయండి. మైండ్ రిలాక్స్ అవుతుంది.. డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది. కానీ.. మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సర్జరీలు జరగడానికి ముందు.. సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు. ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పినైనా నివారించడానికి మ్యూజిక్ థెరపి మంచిదంటున్నారు సైంటిస్ట్ లు. క్యాన్సర్ పేషంట్స్, ఐసీయూ లో ఉండే రోగులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడి మ్యూజిక్ వినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. వయసు మీదపడిన వాళ్లు, అల్జీమర్స్ తో బాధపడే వాళ్లు.. తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి రెండు గంటలు మ్యూజిక్ వినడం వల్ల... త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్ గా ఇష్టమైన సంగీతం వినండి. రిధం, మెలోడి, వాయిస్ ఇలా మ్యూజిక్ లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వెర్బల్ ఇంటిలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వెర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకడమిక్ పర్ఫామెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే.. సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com