మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్లో రోడ్‌షో

- January 24, 2016 , by Maagulf
మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్లో రోడ్‌షో

రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్‌షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ప్రచారాన్ని తలపెట్టారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోడ్‌షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ, జగద్గిరిగుట్టలో రోడ్‌షో కొనసాగనుంది. రేపు అల్లాపూర్, బాలాజీనగర్, కూకట్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, మారారంలో రోడ్‌షో కార్యక్రమం. గ్రేటర్ పోలింగ్ ఫిబ్రవరి 2వ తేదీన. కౌంటింగ్ 5వ తేదీన. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ఈ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com