నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ...
- January 24, 2016
మంత్రి గంటా శ్రీనివాసరావు నవ్యాంధ్రలో విశాఖపట్నం కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ వర్గాలతోపాటు తమిళం, మళయాళం, ఇతర సినీ పరిశ్రమ వర్గాలు కూడా ఇక్కడ షూటింగ్‌లు నిర్వహించుకునేలా విశాఖపట్నంను తీర్చిదిద్దుతా మని అన్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ సమావేశ మందిరంలో చాంబర్ ప్రతినిధులు ఆదివారం ఆయనను సన్మా నించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం తరుపున కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు కూడా నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే పట్టుదలతో ఉన్నారని ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులకు తెలిపారు. సకల సౌకర్యాలతో విశాఖను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా మన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన విశాఖను సినీ పరిశ్రమ కేంద్రంగా మాత్రమే కాకుండా.. టూరిజం హబ్‌గా కూడా తీర్చిదిద్దుతామని తెలిపారు. అనంతరం ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు వైజాగ్‌లో నిర్మించబోయే ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్‌ఎనసీసీ) నిర్మాణంపై ప్రజెంటేషన ఇచ్చారు. కార్యక్రమంలో 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అర్జున, సురేష్‌బాబుతోపాటు పలువురు సినీ నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







