భారత్, బహ్రెయిన్ స్నేహబంధం
- January 24, 2016
ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, గుడైబియా ప్యాలెస్‌లో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కి స్వాగతం పలికారు. అరబ్ - ఇండియన్ కోఆపరేషన్ ఫోరమ్ సమావేశానికి హాజరయ్యేందుకు సుష్మాస్వరాజ్ బహ్రెయిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తరఫున బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్‌కి గ్రీటింగ్స్ తెలియజేశారు సుష్మా స్వరాజ్. బహ్రెయిన్ - భారత్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా మెరుగుపడవలసి ఉందనీ, వ్యాపారాత్మక కోణంలో ఇరు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకునే వైఖరి బలోపేతమవడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఇరువురూ వ్యాఖ్యానించారు. బహ్రెయిన్ ప్రగతిలో భారత వలసదారుల కృషిని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ ప్రిన్స్ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్‌లో భారత్ - బహ్రెయిన్ పౌరుల మధ్య సఖ్యత చాలా గొప్పతని ఆయన అన్నారు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







