జాతీయ గీతాలాపన ...స్పోర్ట్స్ హీరోస్..
- January 25, 2016
జాతీయ గీతాలాపన ఎప్పుడు చేసినా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుందన్నాడు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఆదివారమిక్కడ జరిగిన ది స్పోర్ట్స్ హీరోస్ ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో సచిన్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్ ఫైనల్ ప్రారంభానికి ముందు కిక్కిరిసిన వాంఖడే స్టేడియం మధ్యలో నిలబడి జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు కలిగిన అనుభూతి ఎప్పటికీ మరువలేనిదని చెప్పాడు. అందరూ కలిసి జాతీయ గీతాలాపన చేస్తే ఆ అనుభూతి మరో స్థాయికి చేరుతుంది. ఇలాంటి అనుభావాలు నాకు రెండు ఉన్నాయి. 2003 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో సెంచూరియన్ స్టేడియంలో జరిగిన వన్డేలో 60 వేల మంది కలిసి జన గణ మన అంటూ పాడిన సందర్భం ఒకటైతే, మరొకటి 2011 ప్రపంచకప్ ఫైనల్లో.ఆ రెండు సందర్భాల్లో నాకు కలిగిన అనుభూతి నేను మునుపెన్నడూ అనుభవించనిది. వ్యక్తిగతంగా ఎన్ని విజయాలు సాధించినా, జాతీయ గీతాలపనతో కలిగే ఆ అనుభూతికి సరిరావు అని సచిన్ పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







