PM కేర్స్ ఫండ్ కు 500కోట్లు విరాళమిచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్
- March 31, 2020
కరోనాపై పోరాటంలో భాగంగాకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు తోడు తమ వంతు సాయం అందించేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) పీఎం-కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు అదనంగా 5 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి PM-CARES నిధిని రూపొందించారు. ఈ నిధికి విరాళాలు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పౌరులకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా,భారతదేశపు మొట్టమొదటి 100 పడకల ప్రత్యేకమైన COVID-19 హాస్పిటల్ కరోనావైరస్ రోగుల చికిత్సకు కేవలం రెండు వారాల్లో సన్నద్ధం చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ముఖేష్ భార్య నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఉచిత భోజనం అందిస్తామని హామీ ఇచ్చింది. అదనంగా, COVID-19 తో పోరాడుతున్న రోగుల కోసం తమకు చెందిన మొత్తం ఆసుపత్రిని కూడా విరాళంగా ఇచ్చారు అంబానీ.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







