అమెరికాలో 3వేలు దాటిన కరోనా మరణాలు
- March 31, 2020
రోనావైరస్ మహమ్మారి అమెరికాను మరింతగా భయపెడుతోంది. ఇప్పటికే మరణించిన వారి సంఖ్య సోమవారం నాటికి 3,000 దాటింది, సోమవారం ఒకేరోజు 540 మరణాలతో మొత్తంగా 3,017 ను తాకింది, అలాగే నివేదించబడిన కేసులు సంఖ్య 163,000 కు చేరుకున్నాయని రాయిటర్స్ పేర్కొంది. మరోవైపు కరోనా పంజా విసురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు వారాల్లో మరణాల రేటు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు.
కరోనా కట్టడికి కోసం చేపట్టిన ఆంక్షల్ని ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అప్పటి వరకు సోషల్ జస్టిస్ ను పాటించాల్సిందేనని సూచించారు. ఇదిలావుంటే కరోనా నివారణ కోసం ప్రభుత్వ ప్రణాళికలు - వ్యూహాన్ని ట్రంప్ ఈరోజు వెల్లడించే అవకాశం ఉన్నట్టు అగ్రరాజ్య మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా ఆ దేశంలో 2 లక్షల మందికి వ్యాధి సోకినట్లు వైట్ హౌస్ అంచనా వేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







