కువైట్:ఆన్ లైన్ లో పాఠాలు..ఆటో పార్ట్స్, వర్క్ షాప్స్ మూసివేతకు కెబినెట్ నిర్ణయం

- April 02, 2020 , by Maagulf
కువైట్:ఆన్ లైన్ లో పాఠాలు..ఆటో పార్ట్స్, వర్క్ షాప్స్ మూసివేతకు కెబినెట్ నిర్ణయం

కువైట్:కరోనా వైరస్ కట్టడికి కువైట్ మంత్రి వర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్ధులు కోరితే పాఠాలను ఆన్ లైన్ బోధించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తరాఖ్ అల్ మెజ్రెమ్ వెల్లడించారు. కేబినెట్ నిర్ణయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించిన ఆయన..కరోనా వైరస్ దేశవ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కార్ మెయిన్టనెన్స్, కారు విడిభాగాల షాపులను వెంటనే మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే వినియోగదారుల సహాకార సంఘంలో కొత్త వాలంటీర్ల నియామకాన్ని నిలిపివేయటంతో పాటు ఇప్పుడున్న వర్కర్ల సంఖ్యను కూడా కుదించాలని నిర్ణయించింది. సహకార సంఘాల కార్మికుల్లో మహిళలకు, పురుషులకు  కోసం రెండు భవనాలను కేటాయించామని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కార్మికులను భవనాల్లోకి అనుమతిస్తామని కూడా తెలిపారు. అయితే..24 గంటల కర్ఫ్యూ విధింపుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ఆలోచిస్తున్నాయనని వెల్లడించారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా ప్రజల ఆరోగ్య సంరక్షణే ముక్యమని అల్ మెజ్రెమ్ అన్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com