కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్వీయ నిర్బంధం యాప్ ప్రారంభించిన యూఏఈ
- April 04, 2020
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్వీయ నిర్బంధం పాటించాల్సిన వారి విషయం యూఏఈ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినా, కరోనా పాజిటీవ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నా తప్పనిసరిగా నిర్బంధం పాటించాల్సి ఉంటుంది. అయితే..కొందరు నిర్బంధం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో యూఏఈ నిర్బంధంలో ఉన్న వారిపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా ఓ Stay Home యాప్ ను ప్రారంభించింది. నిర్బంధం పాటించాల్సిన వ్యక్తులు తప్పనిసరిగా తమ మొబైల్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు ఎటూ కదిలినా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అలా నిర్బంధం పాటించని వ్యక్తులను వెంటనే పసిగట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా యూఏఈ చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..