బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- September 21, 2025
మనామా: బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతానికి ముందడుగు పడింది. బహ్రెయిన్ యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ మంత్రి, కింగ్ ప్రతినిధి హిస్ హైనెస్ షేక్ నాసర్ బిన్ హమద్ అల్ ఖలీఫా సెర్బియాలో అధికారికంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సెర్బియన్ వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బహ్రెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు సమీర్ అబ్దుల్లా నాస్ అధ్యక్షత వహించారు. సెర్బియాలో బహ్రెయిన్ రాయబారి అహ్మద్ అబ్దుల్రెహ్మాన్ అల్-సాత్సీతోపాటు రెండు దేశాల నుండి ప్రముఖ వ్యాపారవేత్తలు , సీనియర్ కార్పొరేట్ అధికారులు పాల్గొన్నారు.
బహ్రెయిన్ అంతర్జాతీయ వాణిజ్య మరియు పారిశ్రామిక కేంద్రంగా గుర్తింపు పొందిందని చెప్పారు. కీలక ఆర్థిక రంగాలు స్థిరమైన అభివృద్ధికి పునాదిగా పనిచేస్తాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించడానికి విస్తృత అవకాశాలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బహ్రెయిన్ మిక్సింగ్ ఆర్థిక వ్యవస్థ ఆదాయ వైవిధ్యానికి దోహదపడతాయని, జాతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని మిస్టర్ నాస్ పేర్కొన్నారు.
బహ్రెయిన్-సెర్బియా ద్వైపాక్షిక సంబంధాలలో వృద్ధి, శ్రేయస్సు కోసం బలమైన సామర్థ్యంపై కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మెరుగుపరచడంతోపాటు పలు రంగాలలో పెట్టుబడి భాగస్వామ్యాలను విస్తరించడంపై సమావేశం ఫోకస్ చేసింది.ముఖ్యంగా బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్, అల్యూమినియం ఉత్పత్తి, రియల్ ఎస్టేట్, పెట్టుబడితో సహా కీలక రంగాలలో బహ్రెయిన్ అనుభవం మరియు పోటీతత్వ ప్రయోజనాన్ని చర్చలలో హైలైట్ చేశారు.
తాజా వార్తలు
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్







