దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన

- September 21, 2025 , by Maagulf
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన

న్యూ ఢిల్లీ:భారతీయ సినీ చరిత్రలో అతి పెద్ద గౌరవంగా పరిగణించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈసారి ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ అందుకోవడం గర్వకారణం. నాలుగు దశాబ్దాలకుపైగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన మోహన్‌లాల్‌కు ఈ గుర్తింపు రావడం సినీ పరిశ్రమ మొత్తానికీ ఆనందకరమైన విషయం. “కంప్లీట్ యాక్టర్” అనే బిరుదును సంపాదించుకున్న ఆయన కేవలం మలయాళ సినీ పరిశ్రమకే కాకుండా, భారతీయ చలనచిత్ర రంగం మొత్తానికి తనకంటూ ప్రత్యేక ముద్ర వేశారు.

నాలుగు దశాబ్దాలుగా సినీ రంగానికి ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ అరుదైన గౌరవం దక్కడంపై మోహన్‌లాల్ స్పందించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (X) (ట్విట్ట‌ర్‌) వేదికగా ఆయన తన ఆనందాన్ని, కృతజ్ఞతలను పంచుకున్నారు.

ఈ పురస్కారం తన ఒక్కడిదే కాదని, తన సినీ ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరిదని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఒక భావోద్వేగపూరిత నోట్‌ను అభిమానులతో పంచుకున్నారు.”దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌర‌వంగా ఉంది. ఈ గౌరవం నాది మాత్రమే కాదు, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరిది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com